శేరిలింగంపల్లి, డిసెంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): నూతనంగా ఏర్పడిన బొల్లారం మున్సిపాలిటీ కార్యాలయాన్ని చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డి.శశిరేఖ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్న అన్ని ఫైల్స్‌ను తనిఖీ చేశారు. అనంతరం మున్సిపల్ అధికారుల నుంచి ఆమె ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఫైల్స్‌ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు.






