శేరిలింగంపల్లి, డిసెంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ లోని నేతాజీనగర్ లో శ్రీశ్రీశ్రీ దత్త జయంతిని పురస్కరించుకుని శ్రీసాయి బృందావన క్షేత్రంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దత్త జయంతి వేడుకల్లో రాష్ట్ర యువజన నాయకుడు రాగం అనిరుధ్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ పండితులు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాగం అనిరుధ్ యాదవ్ లకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సాయిబాబాకి కార్పొరేటర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దత్తాత్రేయ జయంతి వేడుకల్లో భాగంగా అభిషేకాలు, గణపతి, నవగ్రహ, రుద్రహో మాలను నిర్వహించారు. రాష్ట్ర యువజన నాయకుడు రాగం అనిరుధ్ యాదవ్ భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దత్తాత్రేయడు అత్రి మహర్షికి జన్మించి ముని బాలకుడు అనిపించినా దత్త మహర్షికి ఉన్న జ్ఞానం అపారమని, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అయినందు వల్ల గురువుగా భావిస్తామని అన్నారు. ప్రజలందరిపై ఆ గురుదత్త ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పండితుడు రాఘవేంద్ర శర్మ, రాష్ట్ర యువజన నాయకుడు రాగం అభిషేక్ యాదవ్, రాష్ట్ర బీసీ కులాల ఐక్యవేదిక సంఘ అధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్, కాలనీ ఉపాధ్యాయుడు రాయుడు, యోగా గురువు వెంకటేష్ ముదిరాజ్, బిల్డర్ వెంకటేశ్వర్లు, రాధా రాణి రెడ్డి, ఎన్ ఎన్ రెడ్డి, టెక్స్టైల్స్ బోటిక్ ప్రొప్రైటర్ కుషాల్ రెడ్డి, మౌలానా, సాయి బృందం ఆగమయ్య గౌడ్, స్వరూప, భక్తులు తదితరులు పాల్గొన్నారు.





