శేరిలింగంపల్లి, డిసెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ పీజేఆర్ నగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని పరిరక్షించడానికి రూ.19 లక్షల నిధులతో చుట్టూ ప్రహరీ గోడ (కాంపౌండ్ వాల్) నిర్మించడానికి జరుగుతున్న పనులను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పీజేఆర్ నగర్‌లోని ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా ప్రహరీ గోడ( కాంపౌండ్ వాల్) నిర్మించడం జరుగుతుందని అన్నారు. ప్రహరీ గోడ నిర్మాణం పూర్తయిన వెంటనే మొక్కలు నాటి ఉద్యానవనంలాగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, కాలనీ ప్రజల అవసరాల కోసం, మౌలిక వసతుల కల్పనకు ఉపయోగించుకుందామని అన్నారు. ప్రహరీ గోడ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రావణి, చంద్రకాంత్, కాలనీ వాసులు యాదగిరి, రాజుగౌడ్, మల్లేష్, రాజు, శంకర్, వీరబాబు, కృష్ణ, రమేష్, శ్రీను, మల్లేష్, నరేష్, చిన్నా, నవీన్ తదితరులు పాల్గొన్నారు.






