అయ్యప్పస్వామి పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ హమీద్ పటేల్

శేరిలింగంప‌ల్లి, నవంబ‌ర్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజా రాజేశ్వరి నగర్ కాలనీలో 100 ఫీట్ రోడ్డులో రమణ మోటార్స్ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి బోర్ వెల్స్ అధినేత, వ్యాపారావేత్త వెంకట్ రెడ్డి స్వామి నిర్వహణలో మనోహర్ శర్మ పాలెం గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పాల్గొన్నారు. అనంతరం రాజా రాజేశ్వరి నగర్ 60 ఫీట్ రోడ్డులోని బాబాయ్ హోటల్ దగ్గరలో ఎస్ రమణ, లక్ష్మి దేవి దంపతుల కుమారుడు ఎస్ వెంకట్ తరుణ్ స్వామి నిర్వహణలో సుద్దపల్లి విజయకృష్ణ గురు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప పడి పూజ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ శ్రీ అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరికి ఆ అయ్యప్ప కరుణా కటాక్షాలు కలగాలని ఆకాంక్షించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here