శేరిలింగంపల్లి, నవంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి చందానగర్ సర్కిల్ 21 డిప్యూటీ కమిషనర్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి చందానగర్ సెక్షన్ 15వ డివిజన్ మేనేజర్ ని కలిసి సమస్యలను వివరించి, వెంటనే పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. హుడా కాలనీ అరోహన్ స్కూల్ వద్ద మంచినీటి పైప్ లైన్ లీకేజ్ తో మంచినీరు గత 15 రోజుల నుండి వృథా అవుతుందని, పైప్ లైన్ లీకేజ్ సమస్యను పరిష్కరించి సిసి రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. హఫీజ్ పేట్ గ్రామం కుమ్మర బస్తీలో చాలా రోజుల నుండి పెండింగ్ లో ఉన్న సిసి రోడ్ పనులను వెంటనే ప్రారంభించాలని అన్నారు. సాయి నగర్ లోని హిందూ శ్మశాన వాటికకు వెళ్లే దారిలో నూతన సిసి రోడ్ వేయాలని కోరారు. సదరు శ్మశానవాటికకు నిధులు కేటాయించి నీటి వసతి కోసం కొత్తగా బోరు వేయాలని, విద్యుత్ కనెక్షన్ ఇచ్చి మరికొన్ని వీధి దీపాలు, ఇతర కనీస వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ రమణయ్య , హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు , డివిజన్ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి బాలరాజు , బీజేవైఎం ఉపాధ్యక్షుడు వినయ్ కుమార్ , బీజేపీ నాయకులు నరసింహ , మల్లేష్ , సదా శివం ఇతరులు పాల్గొన్నారు.






