శేరిలింగంపల్లి, నవంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డిజిల్లా నూతన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలితా దేవిని టిఆర్పిఎస్ RMP PMP వైద్య సంఘాల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా. వెంకట్ రెడ్డి, డా శివశంకర్, డా సదానందం, డా. రామ్, డా, అలీ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎలాంటి విద్యార్హతలు లేని వ్యక్తులు రంగారెడ్డి జిల్లా పరిధిలో ని శేరిలింగంపల్లి, కొండాపూర్, మణికొండ, హాఫిజ్ పేట్, నానక్ రామ్ గూడ, గోపన్ పల్లి, గచ్చిబౌలి, ఖాజాగూడ, మియాపూర్ తదితర ప్రాంతాలలో విచ్చలవిడిగా క్లినిక్స్, హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేశారని డీఏంహెచ్ఓ దృష్టికి తీసుకెళ్లారు. రక్త పరీక్ష కేంద్రాలు పెట్టి హౌస్ విజిట్ చేస్తూ గ్లూకోజ్, సెలైన్స్, ఇంజక్షన్స్, డ్రెస్సింగ్ చేస్తున్నారని వివరించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అలాంటి వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డీఏంహెచ్ఓను కోరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని డీఏంహెచ్‌ఓ తమకు చెప్పారని డా. వెంకట్ రెడ్డి తెలిపారు.






