శేరిలింగంపల్లి, నవంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): విద్యార్థులకు సరైన ప్రణాళికతో విద్యను అందిచటంతోపాటు, నేటి సామాజిక చెడు అంశాలపై అవగాహన కల్పించటం అత్యవసరమని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ బి శ్రీనివాస్ అన్నారు. చదువుతోపాటుగా మన సంస్కృతి, సంప్రదాయాలను మిళితం చేసి విద్యార్థులకు అందిచటం అందరి భాద్యత అని సంస్కృతి గ్రూప్ ఆఫ్ చైర్మన్ మంగళారపు లక్ష్మణ్ అన్నారు. నేటి రోజుల్లో విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం చాలా అవసరమని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ బి శ్రీనివాస్ అన్నారు. గురువారం సాయంత్రం రాఘవేంద్ర కాలనీలోని సంస్కృతి హైస్కూల్లో జరిగిన చిల్డ్రన్స్ డే ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. పెరుగుతున్న టెక్నాలజీతోపాటు సమాజాన్ని అస్థిరపరిచే అలవాట్లు విద్యార్థుల్లో పెరుగుతున్నాయని, తల్లిదండ్రులు, గురువులు పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మన పిల్లలు మంచివారైనా కొన్ని సందర్భాలు వాళ్లను దారి తప్పేలా చేస్తున్నాయని పేర్కొన్నారు.

చిల్డ్రన్స్ డే ఉత్సవాల్లో భాగంగా సంస్కృతి స్కూల్ మేనేజ్మెంట్ వారు వారం రోజులపాటు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులను అందజేశారు. కొండాపూర్ లోని నకోడ గోల్డ్ షాప్ వారు వెండి రేకులపై ముద్రించిన హనుమాన్ చాలీసా పుస్తకాలను బహుమతులుగా విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులు వివిధ నృత్యాలతో చూపరులను ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి గ్రూప్ ఆఫ్ చైర్మన్ మంగళారపు లక్ష్మణ్, ప్రిన్సిపాల్ కృష్ణ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ బాలరాజ్, విద్యార్థుల తల్లిదండ్రులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.






