శేరిలింగంపల్లి, నవంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లోని గౌతమినగర్ లో జి శ్రీకాంత్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహా పడి పూజ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ స్వామివారి పడిపూజ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలపై అయ్యప్ప స్వామివారి కృప, చల్లనిచూపు తప్పక ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మాజీ కౌన్సిలర్ జి రవీందర్ రావు, సీనియర్ నాయకులు మిరియాల రాఘవ రావు, సత్యనారాయణ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, యువ నాయకులు మిరియాల ప్రీతం, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






