శేరిలింగంపల్లి, నవంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శుభోదయ కాలనీలో కూకట్ పల్లి జోన్ ఆంధ్రప్రభ దినపత్రిక ఇంచార్జ్ రాహుల్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్, అయ్యప్ప స్వాములు, భక్తులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.






