శేరిలింగంపల్లి, నవంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): మియపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ గుర్నాథమ్ చెరువు సుందరీకరణలో భాగంగా Nexus select Malls కంపెనీ CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టిన చెరువు పునర్జీవనంలో భాగంగా సుందరీకరణ, పునరుద్ధరణ పనులు పూర్తయిన సందర్భంగా చెరువును కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగ వాడ్, Nexus select Malls ప్రతినిధులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 64 చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. చెరువుల సుందరీకరణతో స్వచ్చమైన వర్షపు జల సిరులను ఒడిసిపడుదామని , చెరువుల జలకళ తో గ్రామీణ వాతావరణం నెలకొల్పడమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. చెరువులను కాపాడితే అవి మనల్ని కాపాడుతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో Nexus Select Malls ప్రతినిధులు జయన్ నాయక్, నిలేష్ సింగ్, నిశాంక్ జోషి, హర్ష, తన్విర్ షేక్, బ్లాక్ స్టోన్ గ్లోబల్ ESG ప్రతినిధులు ఏరిక్, పారిస్, CSR ఐటీ సంస్థ ప్రతినిధులు చైతన్య, రాము, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





