శేరిలింగంపల్లి, నవంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ లో పేదలతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మిరియాల ప్రీతం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. బస్తీ ప్రజలు, సామాజిక కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ప్రతి ఒక్కరికి బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మిరియాల ప్రీతం మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టటం రాష్ట్ర ప్రజలకు అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆయన పాలనలో ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు, చెరువుల సంరక్షణ వంటి ముందచూపు కార్యక్రమాలు ప్రవేశపెట్టారని, రానున్న తరాలకు ఎంతో లాభం చేకూరుస్తుందన్నారు. వచ్చే 10 సంవత్సరాలు ఆయన సీఎం పదవిలో కొనసాగాలని ఆశిస్తున్నామని అభిప్రాయపడ్డారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పరదేశి నాయుడు, చంద్రశేఖర్, టిల్లు, రాకేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.






