హైద‌రాబాద్ అభివృద్ధి కోసం తెరాస‌కు ప‌ట్టం క‌ట్టాలి: ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

కొండాపూర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ ప‌రిధిలోని మార్తాండ్ నగర్, ప్రేమ్‌నగర్ కాలనీ లకు చెందిన కాంగ్రెస్ మైనారిటీ సీనియర్ నాయకులు అబ్దుల్ ఖదీర్, రజాక్, అమీనుద్దీన్, హనీఫ్, జాలీల్, నూర్‌లు ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, డివిజన్ తెరాస పార్టీ అభ్యర్థి హమీద్ పటేల్ ల స‌మ‌క్షంలో తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి తెరాస పార్టీ కండువాలు కప్పి వారిని గాంధీ సాదరంగా తెరాస పార్టీలోకి ఆహ్వానించారు.

తెరాస‌లో చేరిన వారికి పార్టీ కండువాలు క‌ప్పుతున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ
పార్టీలో చేరిన నాయ‌కుల‌తో ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, హమీద్ పటేల్

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ అభివృద్ధి కొనసాగాలంటే ఎన్నికల్లో మరోసారి టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని కోరారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వందకుపైగా సీట్లు సాధించి సొంతంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామ‌ని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ను మహానగరంగా తీర్చిదిద్దుతున్నార‌ని అన్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా టీఆర్‌ఎస్‌కు ఓటేస్తామ‌ని ప్ర‌జ‌లు అంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ చౌదరి, తిరుపతి, రజినీకాంత్, నర్సయ్య, బాబూమియా పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here