ఇంటింటి ప్రచారంలో బిజెపి ముందడుగు: రవి కుమార్ యాదవ్

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార కార్యక్రమంలో భాగంగా షేక్ పేట్ డివిజన్ ఓయూ కాలనీ లోని ప్రతి శక్తికేంద్రంలో నిర్వహించిన మహాప్రచార పాదయాత్ర కార్యక్రమం, అనంతరం నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పాల్గొని ప్రతి ఒక్క ఓటరు ప్రధాని నరేంద్ర మోదీ దేశం కోసం, ప్రజలకోసం నిరంతరం కృషి చేస్తూ ఎన్నో సంస్కరణలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయం పోలింగ్ బూత్ లోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఆలోచించి కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత పదేళ్ల బి.ఆర్.ఎస్ విఫలమైన పాలన గురించి ప్రజలకు క్షుణ్ణంగా తెలుసుని, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 2 ఏళ్ల పాలనలోనూ సెటిల్మెంట్ ప్రభుత్వం గా పేరుగాంచిందని, ఎక్కడ చూసినా దందాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ప్రతి ఒక్క ఓటరు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని, సంస్కరణలను , బడుగు వర్గాల అభ్యున్నతి కోసం అమలుచేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను పోలింగ్ బూత్ లోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఆలోచించి మీ అమూల్యమైన ఓటును కమలం పువ్వు గుర్తు పై వేసి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి , జాతీయ బీజేవైఎం నాయకుడు సాయి ప్రసాద్, శక్తి కేంద్ర ఇన్చార్జి వసంత యాదవ్, నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్రరావు, సీనియర్ నాయకులు స్వామి గౌడ్, ఎల్లేష్, సుమలత , శివ సింగ్ , రేవతి , లక్ష్మణ్ ముదిరాజ్ , కిషోర్ ముదిరాజ్, నరేందర్ యాదవ్, గణేష్ ముదిరాజ్, సంజీవ్, అమర్నాథ్ యాదవ్, వరలక్ష్మి,రాము, శ్రీనివాస్ , నాగులు , రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here