శేరిలింగంపల్లి, అక్టోబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): పిల్లలకు పోలియో సోకకుండా వారి నిండు జీవితానికి రక్షణగా తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో, లింగంపల్లి విలేజ్ బస్తీ దవాఖానాలో స్థానికంగా నివసిస్తున్న పేద ప్రజల పిల్లలకు DM&HO డాక్టర్ లలితా దేవితో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పోలియో టీకాను వేశారు. ఈ సందర్భంగా నూతనంగా రంగారెడ్డి జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన లలితాదేవిని శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల లోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాకేష్, డాక్టర్ ఉమా దీపిక, డాక్టర్ మొహమ్మద్ ఆవేజ్, హీన, డాక్టర్ సమీన, డాక్టర్ జ్యోత్స్న, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, SLVDC ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, బాపునగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, నర్సింహా, సైదులు యాదవ్, మహేష్, సాయి, రాకేష్, శరణ్, ముంతాజ్ బేగం, సరోజిని శ్యామల హాస్పిటల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.





