శేరిలింగంపల్లి, అక్టోబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ ప్రగతి ఎన్ క్లేవ్ పార్కులో ఒరిస్సా ప్రాంతానికి చెందిన వీరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉక్తల్ సేవా సమితి 6 వార్షికోత్సవ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ద్వీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ సేవా సమితి వార్షికోత్సవానికి తనను ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. శేరిలింగంపల్లి ఒరిస్సా ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ స్థిరపడి అనేక వృత్తులు చేస్తూ జీవనోపాదం పొందుతున్నారని, వారందరికీ భారతీయ జనతా పార్టీ తరపున ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి తమ సహాయ సహకారాలను ఎల్లప్పుడూ కమిటీ సభ్యులకు అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నాగుల గౌడ్, మాణిక్ రావు, రాధాకృష్ణ యాదవ్, మహేష్ యాదవ్, లక్ష్మణ్ ముదిరాజ్, శ్రీనివాస్ యాదవ్, ప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్, గోపి, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.






