ఫుట్‌పాత్ ఆక్ర‌మ‌ణ‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు: మియాపూర్ ట్రాఫిక్ సీఐ ప్ర‌శాంత్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఫుట్‌పాత్‌ల‌ను ఆక్ర‌మిస్తే ఎలాంటి వారిపైనైనా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మియాపూర్ ట్రాఫిక్ సీఐ ప్ర‌శాంత్ హెచ్చ‌రించారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని జేపీ న‌గర్ నుంచి హెచ్ఎంటీ స్వ‌ర్ణ‌పురి కాల‌నీ వ‌ర‌కు ఉన్న ర‌హ‌దారికి ఇరువైపులా వెల‌సిన ఫుట్‌పాత్ ఆక్ర‌మ‌ణ‌లను ట్రాఫిక్ పోలీసులు తొల‌గించారు. ఈ సంద‌ర్భంగా సీఐ ప్ర‌శాంత్ మాట్లాడుతూ ఫుట్‌పాత్‌లు అనేవి కేవలం పాద‌చారుల కోసం నిర్మాణం చేయ‌బ‌డ్డాయ‌ని, అలాంటి ఫుట్‌పాత్‌లను ఆక్ర‌మిస్తే ఎలాంటి వారిపైనైనా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. చిరు వ్యాపారులు సైతం ఫుట్‌పాత్‌ల‌ను ఆక్ర‌మించ‌కుండా త‌మ వ్యాపారాల‌ను కొన‌సాగించుకోవాల‌ని, ట్రాఫిక్ స‌జావుగా కొన‌సాగేందుకు స‌హ‌క‌రించాల‌ని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here