శేరిలింగంపల్లి, అక్టోబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్ కాలనీ కి చెందిన సగర(ఉప్పర) సంఘం వాసులు కమ్యూనిటీ హాల్ నిర్మాణంకోసం అసోసియేషన్ సభ్యులు సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రకాష్ నగర్ కాలనీ కి చెందిన సగర(ఉప్పర) సంఘం సభ్యులు మాట్లాడుతూ హఫీజ్ పేట్ పరిసర ప్రాంతాలలో 300 కుటుంబాలకు పైగా సగరులు నివసిస్తున్నారని అన్నారు. వారికి ఉపయోగపడే విధంగా అందరికీ ఆమోదయోగ్యమైన కమ్యూనిటీ హాల్ ను నిర్మించుకుంటామని అన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రకాష్ నగర్ కాలనీ కి చెందిన సగర(ఉప్పర) సంఘం సభ్యుల విజ్ఞప్తి మేరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని , కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. అందరికీ ఉపయోగపడే విధంగా అందరికీ ఆమోదయోగ్యమైన కమ్యూనిటీ హాల్ ను నిర్మించుకోవడానికి ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం అని , కమ్యూనిటీ హాల్ ను సగర సంఘం సంక్షేమం , అభివృద్ధి కోసం చక్కగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, సగర ( ఉప్పర) సంఘం అధ్యక్షుడు వెంకట్రాములు సాగర్, గౌరవ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ సాగర్, తిరుపతయ్య సాగర్, రంగయ్య సాగర్, సలహాదారులు అంపయ్య, కృష్ణయ్య, సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు సాయి బాబా సాగర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు సాగర్, శివ సాగర్, సహాయ కార్యదర్శి వెంకటేష్, కోశాధికారి మందాడి నారాయణ, సంయుక్త కార్యదర్శులు రాజు సాగర్, అనిల్ సాగర్, ప్రచార కార్యదర్శులు సాయిరాం, నర్సింలు, శ్రీధర్, మారుతి సాగర్, రాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.





