శేరిలింగంపల్లి, అక్టోబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో బస్ భవన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలివెళ్తున్న శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాని ఖాజాగూడ లోని ఆయన నివాసం లో రాయదుర్గం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అనంతరం ఆయనను రాయదుర్గం పోలీస్ స్టేషన్కు తరలించారు.






