శేరిలింగంపల్లి, అక్టోబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రావణ దహనం కార్యక్రమంలో కైతాపురం కుమ్మరి శ్రీశైలం కుటుంబ సభ్యులు పాల్గొని రావణదహనం చేశారు. అంతకు ముందు బాణాసంచా కాల్చి సంబరాలను నిర్వహించారు. దాండియా ఆటపాటలతో ప్రాంగణమంతా హోరెత్తింది. ఈ కార్యక్రమంలో నిమ్మల గోపాల్ గౌడ్, నిమ్మల బాలింగ్, లక్ష్మయ్య, కనకమామిడి యాదయ్య, బాలింగ్ యాదగిరి, తలారి లక్ష్మయ్య, తలారి భీమయ్య, అశోక్ ముదిరాజ్, పుట్ట వినయ్ కుమార్ గౌడ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, కమ్మరి వెంకటేష్, వెంకటేష్ గౌడ్, సుదర్శన్, శేఖర్ గౌడ్, కుమ్మరి వెంకటేష్, జితేందర్ యాదవ్, ఆనంద్ గౌడ్, హనుమాన్ యూత్ అధ్యక్షుడు కనకమామిడి నరేంద్ర గౌడ్, సురేందర్ గౌడ్, మన్నే వెంకటేష్, దేవేందర్, పాండు, చేగురీ సాయి, రాజేష్ యాదవ్, వినోద్ ముదిరాజ్, నరేష్, దిలీప్, ప్రవీణ్ యాదవ్, శ్రీకాంత్, రాము, నవీన్, పరిసర ప్రాంత ప్రజలు, యువతీ యువకులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






