శేరిలింగంపల్లి, అక్టోబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ గౌతమీనగర్ లో కాలనీవాసులు దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విజయ దశమి సందర్భంగా గౌతమీనగర్ వినాయక ఉత్సవ సమితి, కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌతమీనగర్ మున్సిపల్ పార్కులో జమ్మి చెట్టుకు సాంప్రదాయబద్ధంగా పూజాకార్యక్రమాలు నిర్వహించి భక్తి ప్రపత్తులతో శమీపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి, ఎలభద్రి శివరాజయ్య, అసోసియేషన్ సభ్యులు ఆదిశేషయ్య, దామోదర్ గౌడ్, సాంబశివరావు, సంజీవరెడ్డి, దశరథ్, వెంకటేశ్వర్లు, వెంకట్, రంగనాథ్, వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులు తనవ్, నవీన్, హరి, కార్తీక్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.






