శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): బతుకమ్మ పర్వదిన సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహిళలకు గోదాకృష్ణ ఫంక్షన్ హాల్ లో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ చీరలను పంపిణీ చేశారు. కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావుతో కలిసి గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ పేదింటి ఆడపడుచులు కూడా పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మహిళలకు బతుకమ్మ చీరలను అందించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఆడపడుచులకు చీరలను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.






