శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): బీహెచ్ఈఎల్ లోని అన్నపూర్ణ ఆడిటోరియం వేదికగా ఓనమ్ పండుగను పురస్కరించుకుని నాయిర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓనమ్ ఉత్సవంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాతాళ లోకం నుంచి తన ప్రజలను సందర్శించడానికి వచ్చే పురాణ చక్రవర్తి మహాబలికి స్వాగతం పలుకుతూ వేడుకలనునిర్వహిస్తారని అన్నారు. ఈ పండుగ కేరళ ప్రజల సంస్కృతి, ఐక్యత, దయ, కృతజ్ఞత వంటి విలువలను ప్రతిబింబిస్తుందని అన్నారు. ఓనమ్ పండుగలో ప్రధానమైన చివరి రోజు తిరువోణం నాడు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఓనసాధ్య విందులో పాల్గొంటారని, ఈ పండుగ కేరళ సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మిరియాల రాఘవ రావు, యువ నాయకుడు పృథ్వీ రాజ్, నాయర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఛైర్మెన్ శివ శంకరన్, ప్రెసిడెంట్ మధుసూదన్, జనరల్ సెక్రటరీ వినోద్ కుమార్, నాయర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






