శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమాచార్య భావనా వాహిని అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు ఆధ్వర్యంలో కొనసాగుతున్న నాదబ్రహ్మోత్సవ్- 2025లో భాగంగా 4వ రోజు సాయంత్రం లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ సంస్థ వ్యవస్థాపకుడు కొమండూరి రామాచారి బృంద సమేతంగా భావములోన భాగ్యమునందును, నల్లని మేని వాడు, మొక్కరో మొక్కరో, చెలగి కొలువులోన, తినరాని, కొనరాని దేవలోకపు పండు, వెంకటాచల నిలయం అనే సుమనోహర సంకీర్తనలను సభక్తి పూర్వకంగా స్వామి వారికి నివేదించగా వీరికి కీబోర్డు మీద రాజు, తబలా మీద విజయ్ వాయిద్య సహకారం అందించారు.

ఈ కార్యక్రమానికి భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, ప్రముఖ శిల్ప్ (ఆల్మోర) డైరెక్టర్ పద్మజ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ అన్నమయ్య పాటలకు శోభారాజు చేసిన కృషి, ఆమె చూపిన భక్తి మార్గంలో నడిచిన వారు దేశ విదేశాలలో ఎందరో మహానుభావులుగా మారారని అన్నారు. ఆమె సమక్షంలో నిర్వహిస్తున్న నాద బ్రహ్మోత్సవ్ లో పాల్గొనడం తమ అదృష్టమని తెలిపారు. చివరిగా శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతులు అందించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.






