చాక‌లి ఐల‌మ్మ పోరాటం ఎంతో మందికి స్ఫూర్తి: భిక్షపతి యాదవ్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా హఫీజ్‌పేట్ గ్రామవాసులు నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి హాజ‌రైన శేరిలింగంపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు భిక్షపతి యాదవ్ చాక‌లి ఐల‌మ్మ చిత్ర‌పటానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ​తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి స్ఫూర్తిదాత చాకలి ఐలమ్మ అని అన్నారు. నిజాం నిరంకుశ పాలన, భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఐలమ్మ చేసిన కృషి ఎన‌లేనిద‌ని అన్నారు. ​తన కౌలు భూమిని కొంద‌రు పెత్తందార్లు లాక్కోవాలని చూసినప్పుడు ఒంటరిగా ధైర్యంగా నిలబడి గూండాలను తరిమికొట్టి పంటను కాపాడుకున్న ధైర్యశాలి అని అన్నారు. ఆమె పోరాటమే వేలాది మందికి స్ఫూర్తినిచ్చింద‌న్నారు. ఈ కార్యక్రమంలో బోయిన మహేష్ యాదవ్, రాజ్ కుమార్, రవి ముదిరాజ్ , నవీన్ , అశోక్, భిక్షపతి, లక్ష్మణ్, కుమార్ సాగర్ , రాజు , రజక సంఘం నాయ‌కులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here