నాద బ్రహ్మోత్సవంలో శ్రీనివాస్ శిష్య బృందం నృత్య ప్రదర్శన

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అన్నమాచార్య భావనా వాహిని అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు ఆధ్వర్యంలో కొన‌సాగుతున్న నాదబ్రహ్మోత్సవ్- 2025 లో భాగంగా మూడవ రోజున సాయంత్రం భరత వేద ఆర్ట్ అసోసియేషన్ సంస్థకు చెందిన డా. శ్రీనివాస్ వరప్రసాద్ పాటి త‌న శిష్య బృందం సూరజ్ , మహిక, గాయత్రి, సంతోషి, కీర్తన, ఋత్విక, సత్య శ్రీ, లహరి, రుద్రాక్షి, పాటి వివర్ధన్ కృష్ణ సంయుక్తంగా ఓం నమో నారాయణ, పెద్ద హనుమంతుడు, అదివో అల్లదివో, శ్రీ వారి వాహనాలు అనే బహుళ ప్రాచుర్యం పొందిన సంకీర్తనలకు చక్కని అభినయం జోడించి సభక్తి పూర్వకంగా స్వామి వారికి అందించారు.

ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీ శ్రీ స్వామి సాక్షిరూపానంద ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడుతూ శోభారాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాద బ్రహ్మోత్సవ్ ద్వారా నేటి సమాజానికి భక్తి బీజాలు నాటి వాటి ద్వారా భావ కాలుష్య నివారణ చేస్తున్నందుకు కళాకారులను ఆశీర్వదించి, రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వ‌హించాలని, వాటి ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. చివరిగా శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతులు అందించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here