శిల్పారామంలో ఘ‌నంగా బ‌తుక‌మ్మ సంబురాలు

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ద‌స‌రా, బ‌తుక‌మ్మ పండుగ‌, దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో భాగంగా మాదాపూర్ శిల్పారామంలో శారీస్ అఫ్ ఇండియా మేళాను నిర్వహిస్తున్నారు. బనారస్, చెందేరి, కోట, గుజరాతీ, ఉప్పాడ, బనారస్, కాశ్మీరీ త‌దిత‌ర చీరలు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. ఈ సంద‌ర్భంగా ఒడిసి, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. దేబస్రి పట్నాయక్ బృందం ఒడిసి నృత్యంలో నవదుర్గ, స్థాయీ, జనసమ్మోహినీ మొదలైన అంశాలను నీలాంజన, అనన్య, స్వాతి, సోనాలి, యుక్తి ప్రదర్శించారు. దుర్గేష్ నందిని శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలు అయిన‌ గణేశా పంచరత్న , జయము జయము, శారదా భుజంగం, హంసానందిని తిల్లాన, కామాక్షి స్తుతి, దశావతరం అంశాలను కళాకారులు గాయత్రీ, ఫణి, సూరజ్ , షణ్ముఖి, సంయుక్త, అంజనీ, జయ , దివ్య ప్రదర్శించారు. శిల్పారామం మహిళా సిబ్బంది బతుకమ్మల‌ను పేర్చి మెయిన్ లాన్ లో అల‌రించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here