పేద‌ల‌కు ఆహారం పంపిణీ చేసిన డా. వెంకట్ రెడ్డి

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ముకేశ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా. వెంకట్ రెడ్డి ప్రథ‌మ కుమారుడు డా. ముకేశ్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో, తెల్లాపూర్ HUDA లో, నల్లగండ్ల ఫ్లైఓవర్ కింద నివసిస్తున్న పేద‌ల‌కు టీఆర్‌పీఎస్ ఆర్ఎంపీ పీఎంపీ వైద్య సంఘాల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా. వెంక‌ట్ రెడ్డి దుస్తులు, పండ్లు, పులిహోర ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్ల‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ KN మూర్తి, జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి, డా.శివశంకర్, డా.ఆంజనేయులు, డా.రాజు, డా.రామ్, మీడియా ఎడిటింగ్ గోపి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here