శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): దసరా నవరాత్రులు, బతుకమ్మ వేడుకల్లో భాగంగా శేరిలింగంపల్లిలోని చందానగర్ సర్కిల్ పరిధిలో ఉన్న బతుకమ్మ ఘాట్ల వద్ద చేపట్టిన ఏర్పాట్లపై డీసీ శశిరేఖ ఆయా విభాగాలకు చెందిన అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయా మాధ్యమాలలో చేసిన ఫిర్యాదులపై ఆమె పలు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. మై జీహెచ్ఎంసీ ఆఫీసర్ యాప్, సీఎం ప్రజావాణి, ప్రజా వాణి హెడ్ ఆఫీస్, సర్కిల్ ప్రజావాణిలలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను ఆమె పరిశీలించారు.






