భ‌వానిపురం కాల‌నీలో ఘ‌నంగా ఎంగిలిపూల బ‌తుక‌మ్మ వేడుక‌లు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని చందాన‌గర్ లో ఉన్న భ‌వానిపురం కాల‌నీలో మహిళ‌లు బ‌తుక‌మ్మ ఉత్స‌వాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ఎంగిలి పూల బ‌తుక‌మ్మ వేడుక‌లో మ‌హిళ‌లు త‌మ ఆట పాట‌ల‌తో సంద‌డి చేశారు. రంగు రంగుల పూల‌తో అలంక‌రించిన బ‌తుక‌మ్మ‌ల‌ను ఒక్క చోట చేర్చి, పాట‌లు పాడుతూ, ఆట‌లు ఆడుతూ బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను జ‌రుపుకున్నారు. ఈ వేడుక‌ల్లో ప‌రిస‌ర ప్రాంతాల‌కు చెందిన మ‌హిళ‌లు, చిన్నారులు అధిక సంఖ్య‌లో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here