ప్రధాని మోదీ జన్మదిన స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ కార్యక్రమం: బోయిని మహేష్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినం సంద‌ర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా పఖ్వాడా (సేవా కార్యక్రమాల పక్షోత్సవాలు)లో భాగంగా బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షుడు జితేందర్ అధ్యక్షతన‌ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ ఓల్డ్ హఫీజ్ పేట్ హనుమాన్ దేవాలయంలో ప్ర‌ధాని మోదీ పేరిట‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోయిని మహేష్ యాదవ్ హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నిస్వార్థ సేవ, దేశాభివృద్ధికి ఆయన పడుతున్న తపన ప్రతీ కార్యకర్తకు, ప్రతీ పౌరునికి ఆదర్శనీయం అని అన్నారు. ప్ర‌ధాని మోడీ జన్మదినాన్ని వేడుకగా కాకుండా, ప్రజాసేవతో జరుపుకోవాలనే గొప్ప సంకల్పంతో బీజేపీ సేవా పఖ్వాడాను నిర్వహిస్తోంద‌ని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here