శ్రీనిధి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీలో బతుకమ్మ, దసరా ఉత్సవాల కార్యక్రమం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ శ్రీరాంనగర్ కాలనీ బి బ్లాక్ శ్రీనిధి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ పాఠశాలలో బతుకమ్మ పండుగ సంబరాల‌ను ఎంతో వైభవంగా నిర్వ‌హించారు. దుర్గామాత‌ నవరాత్రి ఉత్సవాల‌ను నిర్వహించారు. ప్రిన్సిపాల్ సుధ‌ మాట్లాడుతూ విద్యార్థులు ఆటపాటలతో నృత్యాలు చేస్తూ బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకున్నార‌ని, దుర్గామాతను ప్రకృతి మాతగా భావించి రంగురంగుల చీరలు ధరించి కొలువుదీరినట్లుగా తొమ్మిది రకాల చీరలతో 9 ప్రతిమలను దుర్గామాత దేవిలా అలంకరించి తొమ్మిది రకాల ప్రసాదాలు నైవేదించి భక్తితో పూజించార‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here