మియాపూర్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించారు. సినీటౌన్‌ రోడ్‌ నుండి జేపీ నగర్‌ రోడ్‌ వరకు విస్తృతంగా చర్యలు చేపట్టి ఫుట్‌పాత్‌లను స్వేచ్ఛగా చేసి వాహనాల రాకపోకలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా  మియాపూర్ ట్రాఫిక్ SHO ప్రశాంత్‌ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేలా ఆక్రమణలను తొలగించాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు కొనసాగుతాయి. పౌరులు సహకరించాల‌ని తెలిపారు. ఆయన వెంట ఎస్సైలు న‌వీన్‌, విఠ‌ల్ రెడ్డి, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here