శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండల రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీహెచ్ఈఎల్ అంబేద్కర్ స్టేడియంలో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ నవరాత్రి ఉత్సవంలో 40 పాఠశాలల నుండి 2000 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. అందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి తెలంగాణ ఆచార సంస్కృతిని ప్రతిబింబించేలా ఆనందంగా ఆడిపాడి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ వేడుకలలో భాగంగా బతుకమ్మ వేడుకలను అత్యంత ప్రాధాన్యతగా తెలంగాణ రాష్ట్రంలో జరుపుకోవడం మన ఆనవాయితీ అని ప్రతి ఒక్కరూ నవరాత్రి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించుకుంటారని అందరికీ అమ్మవారి కృప ఉండేలా కోరుకున్నట్లుగా తెలియజేశారు. విద్యార్థులతో బతుకమ్మ ఆడి వారిని ఉత్సాహపరిచారు.

ఈ కార్యక్రమాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు ఏఆర్ పవన్ కుమార్, కార్యదర్శి పి త్రిమూర్తులు, ఖజాంచి, శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మోటివేషనల్ స్పీకర్ సత్యవాణి, ట్రాస్మా అధ్యక్షుడు ఎస్ ఎన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ డాక్టర్ కే అనిల్ కుమార్, సీనియర్ కరస్పాండెంట్స్ లయన్ బి వెంకటేశ్వరరావు, నరేంద్రబాబు, ఎస్ ఎన్ రావు, విజయ్, సలీం, రోజి, ప్రదుమ్న, సురేష్, కమలేష్, రత్నకుమారి, రవీందర్, శైలజ, జితేందర్, సుష్మిత, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.





