శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ డివిజన్ పరిధిలోని సమత నగర్ కాలనీ నుండి ప్రగతి నగర్ వెళ్లే మెయిన్ రోడ్ లో ప్రజలు నిత్యం ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని కాలనీ వాసుల సమాచారం మేరకు ట్రాఫిక్, హార్టికల్చర్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారుతో కలసి హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రగతి నగర్ మెయిన్ రోడ్ లో ఎలక్ట్రికల్ పోల్స్, ప్రైవేట్ ఇంటర్నెట్ పోల్స్, ఎండిపోయిన చెట్ల వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని ప్రజలు, కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు అధికారులతో కలసి పరిశీలించామని అన్నారు. వెంటనే పనులను చేపట్టాలని అన్నారు. ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత, సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ప్రజలు అందరూ కలిసి డివిజన్ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ ఎలక్ట్రికల్ ఏఈ దయానంద్, ట్రాఫిక్ ఏ ఎస్ ఐ ప్రభాకర్, GHMC ఎలక్ట్రికల్ లైన్ మెన్ సుధాకర్, హార్టికల్చర్ విభాగం దాసు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






