శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో మరపురాని ఘట్టమని, రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామని ఎంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్ అన్నారు. మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండాలో యం సి పి ఐ (యు )మియాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోతెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముందుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులు మద్దికాయల ఓంకార్, భీమిరెడ్డి నరసింహారెడ్డిలకు ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అతిధిగా హాజరైన గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 మొదలుకొని 1951 వరకు కొనసాగిందని, ఈ పోరాటంలో కమ్యూనిస్టులు నిజాం సర్కార్ కు, నిజాంకు తొత్తులుగా ఉన్న రజాకార్లకు, దేశ్ ముఖ్, భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా జరిగిన వీరోచిత పోరాటంలోమద్దికాయాల ఓంకార్, భీమిరెడ్డి నరసింహారెడ్డి చేసిన పోరాటం భావి తరాలకు ఆదర్శనీయమని అన్నారు. నేటి యువత అలాంటి గొప్ప కమ్యూనిస్టుల చరిత్రను తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు తాండ్ర కళావతి, కర్ర దానయ్య, పల్లె మురళి, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు వి విమల, దేవనూర్ లక్ష్మి, మియాపూర్ డివిజన్ సభ్యులు యండి సుల్తానా బేగం, దేవనూర్ నర్సింహా, బానోత్ అరుణ, జంగయ్య, యం డి రజియా బేగం, అమీనా బేగం, ఎస్ కే గౌసియా బేగం, ఎస్ కే ఖైరునిషా బేగం, జేబునిషా బేగం, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.





