చందాన‌గ‌ర్ స‌ర్కిల్ ప్ర‌జావాణికి 17 ఫిర్యాదులు

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజ‌క‌వ‌ర్గం చందాన‌గ‌ర్ సర్కిల్ ప‌రిధిలోని స్థానిక స‌ర్కిల్ కార్యాల‌యంలో నిర్వ‌హించిన ప్ర‌జావాణి కార్య‌క్ర‌మంలో ప‌లువురు స్థానికులు త‌మ స‌మస్య‌ల‌పై సంబంధిత అధికారులు, సిబ్బందికి విన‌తిప‌త్రాల‌ను అందించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో 15 ఫిర్యాదులు రాగా, ఇంజినీరింగ్ వింగ్‌, యూబీడీ విభాగంలో 1 ఫిర్యాదు చొప్పున వ‌చ్చాయ‌ని అధికారులు తెలిపారు. రెవెన్యూ విభాగం, హెల్త్ అండ్ శానిటేష‌న్‌, యూసీడీ, ఎల‌క్ట్రిక‌ల్‌, ఇత‌ర విభాగాల్లో ఎలాంటి ఫిర్యాదులు రాలేద‌న్నారు. మొత్తం 17 ఫిర్యాదుల‌ను స్వీక‌రించామ‌ని, వీటిని త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here