శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్.దిలీప్ రావ్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్.చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి, జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశంలు ఎన్.దిలీప్ రావ్ కు నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దిలీప్ రావ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని బయటకు తీస్తూ సమాచార హక్కు చట్టం గురించి పౌరులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపీనాథ్ కట్టెకోల, వేముల పుష్పాలత, రాష్ట్ర కార్యదర్శి గండు వెంకటేశ్వర్లు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నీలం వెంకట మధు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్, అరుణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.






