లక్ష్మీనారాయణ రెడ్డి కి బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డు

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 8 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): వేముల మండలం కుప్పగుట్ట పల్లి గ్రామానికి చెందిన జి. లక్ష్మీనారాయణ రెడ్డి ( జి ఎల్ ఎన్ రెడ్డి ) బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డును అందుకున్నారు. సేవా రంగంలో ఆయ‌న చేసిన‌ విశేష కృషి కి గాను న్యూ ప్రీమియర్ టర్బో సర్వీసెస్ సంస్థ టర్బో సర్వీసెస్ కు ఎక్సలెంట్ అవార్డు ను అందించారు. రాజ్ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో తెలంగాణ లో నిర్వహించిన బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఆ సంస్థ చైర్మన్ జి. లక్ష్మీనారాయణ రెడ్డికి అందజేశారు. లక్ష్మి నారాయణ రెడ్డి మొదట్లో టర్బో సర్వీసెస్ లో రూ.1400 జీతంకు పనిచేశారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి 2017 వ సంవత్సరం లో సంస్థలో న్యూ ప్రీమియర్ టర్బో సర్వీసెస్ సంస్థను స్థాపించారు. కూకట్ పల్లి లో ని కెపిహెచ్బి కాలనీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ స్థాపించిన కొన్ని సంవత్సరాలకే అంచెలంచెలుగా ఎదిగింది. ఈ సంస్థలో 100 కు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయి సేవలు అందిస్తామని జి. లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here