శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ ప్రజయ్ సిటీలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. 11 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న లంబోదరుడి లడ్డూ వేలానికి భక్తులు పోటీ పడ్డారు. ఈ వేలం పాటలో ప్రజయ్ సిటీ 5వ బ్లాక్ కు చెందిన సునీల్, సురేష్‌లు రూ.2లక్షల 3 వేలకు వినాయకుడి పెద్ద లడ్డూను దక్కించుకున్నారు. కమిటీ సభ్యులు సునీల్, సురేష్ లకు గణపతి లడ్డును అందజేశారు. ఆ వినాయకుడికి ఆశీస్సులు సునీల్, సురేష్ కుటుంబ సభ్యులపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం గణనాథుడి ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో అలయ కమిటీ సభ్యులు, ప్రజయ్ సిటీ కమ్యూనిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






