శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ లోని ప్రగతి ఎన్‌క్లేవ్ లో కాలనీ అధ్యక్షుడు అట్టేపల్లి రాంప్రభు ఆహ్వానం మేరకు కమ్యూనిటీ హాల్ గణేష్ మండపానికి ముఖ్య అతిథిగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై గణేషున్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ బీఆర్ఎస్ నాయకుడు గోపరాజు శ్రీనివాస్ రావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.






