శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న జీఎస్టీ సంస్కరణలకు కృతజ్ఞతగా హఫీజ్ పేట్ డివిజన్,మదీనా గూడ విలేజ్ చౌరస్తాలో హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. హఫీజ్ పేట్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు కైతాపురం జితేందర్ మాట్లాడుతూ నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు , వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను 18%, 12% నుంచి, 5%, జీవిత , ఆరోగ్య బీమా ప్రీమియంపై 0% మేర భారీగా పన్ను రేట్లు తగ్గించి సాధారణ ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించారని అన్నారు. ప్రపంచ దేశాల్లో నిత్యావసర వస్తువుల ధరలు గగనాన్ని అంటుతున్నా పన్ను భారంతో తమ ప్రజల వెన్ను విరుస్తున్నా భారతదేశ ప్రజలకు నిత్యావసర సరుకులు తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో GST ని తగ్గించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు మహేష్ యాదవ్ , బీజేపీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి అజిత్ సేనాపతి , మాజీ కౌన్సిలర్ రమణయ్య , బీజేపీ నాయకుడు సత్యనారాయణ రాజు, డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రసాద్ పాత్రో , డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజు , బీజేపీ నాయకులు సురేష్ , పాలెం శ్రీనివాస్ , నరసింహ యాదవ్ , కుమార్ యాదవ్ , మహిళా నాయకురాలు పావని , బీజేపీ నాయకులు ప్రభాకర్ రెడ్డి , రామ్ రెడ్డి , మహేష్ గౌడ్ పాల్గొన్నారు.





