శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి యువనేత, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రవీందర్ యాదవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని ప్రత్యేకంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబంతో కలిసి తిరుమల వెళ్లిన ఆయన శ్రీవారిని తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లుగా వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, వరుణుడు శాంతించేలా చూడాలని వేడుకున్నట్లుగా తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, ఇలాంటి ఎన్నో సంక్షోభాలను చూసిందని వెల్లడించారు. త్వరలోనే మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రగతిని చూశామని, రానున్న రోజుల్లో భారాసను అధికారంలోకి తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అధినేత కేసీఆర్ నాయకత్వంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డైరెక్షన్ లో కార్యకర్తలు పోరాటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రలో భాగంగా జరుగుతున్నట్లుగా అభిప్రాయపడ్డారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రవీందర్ యాదవ్ పేర్కొన్నారు.






