శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా అన్నపూర్ణ కాలనీలో పోల రంగనాయమ్మ ఫౌండేషన్ చైర్మన్ పోల కోటేశ్వర రావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ సిఐ విజయ్, రిటైర్డ్ ఎస్ఐ శ్యాం ప్రసాద్, జిల్లా జడ్జి శాంత రాజు, పోలరంగనాయకమ్మ ట్రస్ట్ సభ్యులు అంతీ రెడ్డి , శ్రీకాంత్ , పురం ఆంజనేయులు, వనమా శ్రీనివాస్, పబ్బా శ్రీనివాస్, వాణి, లలిత, వెంకట్ రావు, జితమన్యు, శివ, విద్య సాగర్ , పోల రాములు, జయ్ కుమార్ , రామస్వామి పాల్గొన్నారు.






