అన్నమయ్యపురంలో మనోహరంగా సంకీర్తనాలాపన చేసిన పద్మశ్రీ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు ఆధ్వర్యంలో అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థిని పద్మశ్రీ.. ఆదిపురుషా, భజరే రామనామం, చిత్తము, నామనసే తిరుపతి, కంటి అఖిలాండ, ఇంత చక్కని, నారాయణతే నమో నమో వంటి బహుళ ప్రాచుర్యం పొందిన కీర్తనలను సుమనోహరంగా ఆలపించారు. కీబోర్డ్ శ్రీనివాస్, తబలా అజేయ్ సహకారం అందించారు. అనంతరం కళాకారులకు సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ జ్ఞాపికల‌ను అందించారు. చివరిగా శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతులు అందించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here