శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ జంక్షన్ నుంచి భారీ వాహనాలకు అనుమతులను నిషేధించామని మియాపూర్ ట్రాఫిక్ సీఐ ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో గణేష్ విగ్రహాల నిమజ్జనాలు ఉన్నందున మియాపూర్ జంక్షన్ నుంచి నగరంలోకి ప్రైవేటు ట్రావెల్ బస్సులు, కాంట్రాక్టు క్యారేజ్ బస్సులను, భారీ వాహనాలను అనుమతించడం లేదని తెలిపారు. సెప్టెంబర్ 6వ తేదీ వరకు నిషేధం అమలులో ఉంటుందన్నారు. వాహనదారులు ఔటర్ రింగ్ రోడ్డు వంటి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.





