వెంకటేశ్వర స్వామి ఆలయ ఫౌండర్ ప్రతాపరెడ్డికి స్వామీజీల ప‌రామ‌ర్శ

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): విశాఖ శ్రీ శారద పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఆయ‌న‌ వారసులు శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అనారోగ్యంతో ఉన్న చందానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయ ఫౌండర్ సెక్రెటరీ మూగల ప్రతాపరెడ్డిని ఆయ‌న‌ నివాసంలో పరామర్శించారు. స్వామీజీలతో పాటు చందానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు సాయి, ముఖ్య భక్త బృందం కూడా ఉన్నారు. ప్రతాపరెడ్డి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న పీఠాధిపతులు ఆయన త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయన కుటుంబంపై ఉండాలని ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాపరెడ్డి కుమారులైన ప్రముఖ కాంగ్రెస్ నాయకులు మూగల రఘునందన్ రెడ్డి, నాగిరెడ్డి, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డిల‌ను, వారి కుటుంబాలను కూడా స్వామీజీలు ఆశీర్వదించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here