శేరిలింగంపల్లి, ఆగస్టు 29 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు చోట్ల రహదారులు, గుంతల్లో నిలిచిన వరద నీటిని తొలగించినట్లు స్థానిక సీఐ తెలిపారు. మియాపూర్లోని ఆల్విన్ కాలనీ 65వ నంబరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రణామ్ హాస్పిటల్ వద్ద వర్షాల కారణంగా రహదారులపై, గుంతల్లో నిలిచిన వరద నీటిని తొలగించినట్లు తెలిపారు. అనంతరం గుంతలను తారుతో నింపినట్లు వివరించారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.






