సీఎం స‌హాయ‌నిధి పేద‌ల‌కు అండ‌: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు కొంత ఆర్థిక బారాన్ని తగిస్తుంద‌ని పీసీసీ ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గం ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర్ నగర్ కు చెందిన పార్వతమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఏకాంత్ గౌడ్ ను సంప్రదించగా నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి చెక్కును పార్వతమ్మ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు విద్యకల్పన ఏకాంత్ గౌడ్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here