శేరిలింగంపల్లి, ఆగస్టు 29 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్‌పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీలో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి ధ్వంసం అయిన భవనం, సంఘటన స్థలాన్ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు సిలిండర్ గ్యాస్ లీకు అయ్యి తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించిందని, ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం అని అన్నారు. బాధాకరమైన విషయం అని , క్షతగాత్రులకు మెరుగైన వైద్యం ప్రభుత్వం ద్వారా అందిస్తామని, ఈ ఘటనలో భవనం భారీగా ధ్వంసం అవ్వగా, 7 మంది తీవ్ర గాయల పాలయ్యారు అని అన్నారు. బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను అని పేర్కొన్నారు.

గ్యాస్ లీక్ ద్వారా సిలిండర్ పేలి పెద్ద మొత్తంలో మంటలతో పాటు పేలుడు ధాటికి భవనం గోడలు కూలిపోయాయన్నారు. ఒకవైపు అగ్గికి, మరోవైపు భవన శిధిలాలు పడి వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారని, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం అందిస్తామని, బాధితులు ధైర్యంగా ఉండాలని , తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి స్పష్టం చేశారు. ప్రభుత్వం పరంగా తగిన సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట సి.ఐ నర్సింహ, ఆస్బెస్టాస్ కాలనీ ప్రెసిడెంట్ నరేష్ , మాజీ ప్రెసిడెంట్ నాగేశ్వర్ రావు, నాయకులు ఎల్లం నాయుడు, మహ్మద్ ఉస్సేన్, రఫిక్ నర్సింలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






