ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మ‌ట్టి వినాయ‌కుల‌నే పూజించాలి: PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మట్టి వినాయకులను పూజించి పర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు పాటు ప‌డాల‌ని PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ పిలుపునిచ్చారు. వినాయకచవితిని పురస్కరించుకుని హోప్‌ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 6వేల‌ మట్టి వినాయకుల ప్రతిమలను ప్ర‌జ‌ల‌కు ఉచితంగా పంపిణీ చేశారు. వివేకానంద నగర్ లోని త‌న కార్యలయంలో కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల‌ను ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా గాంధీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాల‌ని అన్నారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించుకోవ‌డాన్ని ఒక బాధ్య‌త‌గా భావించాల‌ని అన్నారు. హోప్ ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో ఇంత భారీ ఎత్తున మ‌ట్టి వినాయ‌కుల‌ను పంపిణీ చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్‌, నాయకులు సంజీవ రెడ్డి, మంత్రి ప్రగడ సత్యనారాయణ, MD ఇబ్రహీం, పురెందర్ రెడ్డి, అష్రాఫ్, శోభన్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here